Chiyan Vikarm Injured in Thangalaan shooting: కోలీవుడ్ హీరో విక్రమ్ PS2 సినిమాతో మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ప్రస్తుతం. దీని తర్వాత విక్రం తంగలాన్ అనే సినిమా చేస్తున్నారు. సినిమాల కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా ముందు ఉండే విక్రమ్ దాదాపు 12సార్లు షూటింగ్ లో గాయపడి ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది.
Chiyan Vikarm Injured in Thangalaan shooting: అలాగే కొన్ని రోజులు క్రితం చాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తంగలాన్ సినిమా షూటింగ్ లో విక్రమ్ గాయపడినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు పక్కటెముకలు విరిగాయి డాక్టర్లు చెబుతున్నారు. తంగలాన్ సినిమా షూటింగ్ భాగంగా యాక్షన్ ఫైట్స్ ని రిహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
పక్కటెముకలు విరగటంతో ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. అలాగే చేసిన తర్వాత నాలుగు నెలలు కనీసం రెస్ట్ తీసుకోవాలంటూ డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. ఏ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా, విక్రమ్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.