choosi choodangaane movie review Rating
choosi choodangaane movie review Rating

chusi chudangane movie review and ratingchusi chudangane movie reviewchusi chudangane review

విడుదల తేదీ : జనవరి 31, 2020
రేటింగ్ : 2/5
నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ తదితరులు.
దర్శకత్వం : శేష్ సింధూ రావ్
నిర్మాత‌లు : రాజ్ కందుకూరి
సంగీతం : గోపీసుందర్
స్క్రీన్ ప్లే : శేష్ సింధూ రావ్

‘పెళ్లి చూపులు’తో జాతీయ అవార్డును, పెద్ద విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి. తర్వాత ‘మెంటల్ మదిలో’తో మరో విజయాన్ని అందుకున్నారు.శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటించగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మించారు.శేష సింధు రావు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ:

సిద్ధు (శివ కందుకూరి)కి ఇంజనీరింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ, ఇంట్లో అమ్మ (పవిత్రా లోకేష్) ఫోర్స్ చేసిందని జాయిన్ అవుతాడు. కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీషన్) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి బ్రేకప్ అవుతుంది. ఈ ఫ్రస్టేషన్ లో సిద్ధు పరీక్షలు రాయకుండా ఆన్సర్ షీట్ చించేసి వస్తాడు. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కావాలనుకుని చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. ఆ టైమ్ లో అతడికి శృతి (వర్ష బొల్లమ్మ) పరిచయం అవుతుంది. శృతితో పరిచయం సిద్ధు జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది. అసలు, ఆమె ఎవరు? ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? అనేది మిగతా సినిమా.

నటీనటులు:

శివ కందుకూరికి తొలి చిత్రమైనా… చక్కటి నటన కనబరిచాడు. పాత్రకు తగ్గట్టు సినిమా ప్రారంభంలో క్యూట్ బాయ్ గా, తర్వాత గడ్డం పెంచి మ్యాన్లీగా కనిపించాడు. పతాక సన్నివేశాలకు ముందు పవిత్రా లోకేష్ తో ఎమోషనల్ సీన్ బాగా చేశాడు. నెక్స్ట్ ఫిలిమ్స్ లో ఇంకా షైన్ అవుతాడు. శ్రుతి పాత్రలో వర్ష బొల్లమ్మ అద్భుతంగా నటించింది. ఆమె నటన వల్ల కొన్ని సీన్స్ అందంగా వచ్చాయి. మాళవికా సతీషన్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. తనకు అవకాశం దొరికిన సీన్స్ లో వెంకటేష్ కాకుమాను నవ్వించాడు. సెకండాఫ్ లో ఒక సీన్ కి అయితే ప్రతి ఒక్కరూ నవ్వుతారు. పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్ల పాత్రలకు తగ్గట్టు నటించారు. అతిథి పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించారు.

ప్లస్ పాయింట్స్:
హీరో హీరోయిన్లు
సంగీతం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, సీన్స్
దర్శకత్వం
కామెడీ ఎక్కువ లేకపోవడం

సాంకేతికవర్గం పనితీరు :

వేదరామన్, రవితేజ గిరిజల సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే కంటెంట్ లో దమ్ము లేకపోవడం వల్ల సీన్స్ ఎంత ఫ్రెష్ గా అనిపించినా ప్రేక్షకులకు ఎక్కువు. ఇక సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. మెలోడీ సాంగ్స్ ఆకట్టుకునాయి. బిజిఎం బాగుంది. ఇక కథ, కథనాల్లో డైరక్టర్ శేష సింధు రావు రొటీన్ కథతో అదే రొటీన్ స్క్రీన్ ప్లే తో వచ్చిన గొప్ప అవకాశాన్ని మిస్ యూజ్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

చూసి చూడంగానే.. సినిమా పోస్టర్.. టీజర్.. ట్రైలర్ ఇవన్ని చూసి ఇదో ఫ్రెష్ లవ్ స్టోరీగా ఆడియెన్స్ భావించారు. అయితే లవ్ స్టోరీలో కొత్త కథతో వస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. కాని ఆల్రెడీ ఒకరితో లవ్ లో పడి బ్రేకప్ అవడం.. ఆ తర్వాత మళ్లీ మరో అమ్మాయికి దగ్గరవడం ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ కథ కూడా అలాంటి రొటీన్ స్టోరీతోనే తెరకెక్కింది.

ఇదొక సింపుల్, రొటీన్ స్టోరీ. కాలేజీలో చేరిన కొత్తలో హీరో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. బ్రేకప్ అవుతుంది. మూడేళ్ల తర్వాత మళ్లీ మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మరో అబ్బాయితో నిశ్చితార్థానికి సిద్ధమవుతుంది. చివరికి, ఈ ప్రేమకథ ఎలా కంచికి చేరిందనేది సినిమా. మొదటి ప్రేమకథ మరీ రొటీన్ గా ఉంటుంది. రెండో ప్రేమకథలో డైలాగుల్లో కొంచెం అక్కడక్కడా కొత్తదనం ఉంటుంది.

ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఎమోషనల్ సాగే లవ్ ట్రాక్ అండ్ కొన్నిచోట్ల డీసెంట్ కామెడీతో అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్, కొన్ని చోట్ల బోరింగ్ ప్లే అండ్ బలమైన సంఘర్షణ లేకపోవడం సినిమా ఫలిత్తాన్ని దెబ్బ తీసింది. కానీ, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అండ్ వర్ష బొల్లమ్మ నటన సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ రొటీన్ కథలో ప్రేక్షకులకు కొంత రిలీఫ్ అంటే మ్యూజిక్. గోపిసుందర్ మంచి మెలోడీలు ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. మహిళా దర్శకురాలు శేష సింధు రావు తన మార్క్ చూపించడంలో విఫలమైంది. అయితే యూత్ ఆడియెన్స్ ను మెప్పించే కొన్ని అంశాలు ఉన్నాయి.