‘చూసి నేర్చుకోకు’ అంటోన్న నితిన్: విడుదల అయిన మరో సాంగ్

149
Choosi Nerchukoku​​ Lyrical Song Released From Nithiin, Keerthy Suresh Rang De Movie

యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్ర లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. కథానుసారం చిత్ర కథా నాయకుడు పరిచయ గీతం గా కనిపించే, వినిపించే ఈ సందర్భోచిత గీతం వివరాల్లోకి వెళితే …..

” సన్ లైట్ ను చూసి నేర్చుకుని ఉంటే.. ఫుల్ మూన్ కూల్ గా ఉండేవాడా.. క్లాస్ మేట్ ని చూసి నేర్చుకుని ఉంటే.. ఐన్ సైంటిస్ట్ అయ్యే వాడా….?” అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు డేవిడ్ సీమన్ గాత్రంలో ఈ గీతం హుషారుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు ముఖ్యంగా యువతను, అలాగే సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. నితిన్ తో పాటు చిత్రంలోఅతని మిత్రులు అభినవ్ గోమటం, సుహాస్ బృందంపై శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ గీతాన్ని వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి..

చిత్ర కథానుసారం కథానాయకుడు పరిచయ గీతం గా ఇది వస్తుంది అని తెలిపారు గీత రచయిత శ్రీ మణి. చిత్రంలోని ప్రతిపాట సందర్భ శుద్ధి గానే సాగుతాయి. కథను చెబుతాయి. ఈ పాట కూడా అంతే. దర్శకుడు వెంకీ గారు చిత్రం లో పాట కు ఉండే సందర్భాన్ని వివరించే తీరు పాటలు ఇంత బాగా రావటానికి కారణం ఆన్నారు శ్రీ మణి.

‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం వరుసగా విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, లిరికల్ వీడియో గీతాలు మరింత పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.

Choosi Nerchukoku​​ Lyrical Song From Rang De

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)..

Click Here For Nithin Choosi Nerchukoku​​ Lyrical Song