Jani Master Runner Movie: ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌కు నృత్య రీతులు సమకూర్చిన జానీ మాస్టర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా ‘రన్నర్’. ‘అరవింద్ 2’ చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Jani Master Runner Movie: విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలియజేసింది.
‘రన్నర్’ ఫస్ట్ లుక్ చూస్తే… ఖాకీ ప్యాంట్ వేసిన జానీ మాస్టర్, షర్టులో వేరియేషన్ చూపించారు. ఒకవైపు ఖాకి ఉంటే… మరోవైపు ఖద్దర్ ఉంది. ఎందుకు అలా డిజైన్ చేశారు? ఆయన ఎవరికి నమస్తే పెడుతున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశాం అని చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర చేపటం జరిగింది.