నాని టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల..?

0
5628
Clarity on Nani Tuck Jagadish on Amazon Prime release

Tuck Jagadish on Amazon Prime : నాచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్న సంగతి సంగతి తెలిసిందే. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ అండ్ మాస్ డ్రామా గత ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు రీత్యా వాయిదా పడుతూ రావడం అలాగే ఏపీలో టికెట్ రేట్స్ ఇస్యూ కూడా పెరగడంతో ఈ సినిమా రిలీజ్ అగమ్యగోచరంగా మారింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాగా ప్రేక్షకులు ఎప్పట్లాగానే వస్తున్నారు. దీంతో టక్ జగదీష్ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సినీ వర్గాల ప్రకారం ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుందట. ప్రస్తుతం మూవీ వర్గాల్లో నాని సినిమా రిలీజ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి.

Tuck Jagadish on Amazon Prime release date

అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. దీంతో టక్ జగదీష్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని టాక్. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమానకు థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Previous articleసందీప్ “గల్లీ రౌడీ” రిలీజ్ డేట్ ఫిక్స్..!
Next articleపోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు