Pooja Hegde Out of Guntur Karam: చాలా సంవత్సరాల తర్వాత మహేష్ బాబు (mahesh babu) అలాగే త్రివిక్రమ్ (trivirkam) కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రాబోతున్న విషయం తెలిసింది. ఈ సినిమాని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ సినిమాపై వస్తూనే ఉంటుంది. గుంటూరు కారం మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ బాబు ఫైట్ మాస్టర్ అన్బరీవ్ పట్ల అసంతృప్తిగా ఉండటంతో ఒక ఫైట్ సీక్వెన్స్ తొలగించడం జరిగింది. ఆ తర్వాత షూటింగు చాలాసార్లు వాయిదా కూడా పడింది.
Pooja Hegde Out of Guntur Karam: ప్రస్తుతం సోషల్ మీడియాలో గుంటూరు కారం నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులు అయినా తమన్ (thaman) అలాగే పూజ హెగ్డే (Pooja Hegde) గురించి న్యూస్ వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో తమన్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, గుంటూరు కారం టైటిల్ అనౌన్స్మెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే కొన్ని రోజులుగా తమ అలాగే మహేష్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నట్టు అలాగే తమ ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే గుంటూరు కారం పై వస్తున్న రోమర్సు గురించి ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందించడం జరిగింది. తమన్ విషయంలో ఎటువంటి మార్పు లేదంటూ.. అలాగే తను సినిమాకి కావాల్సిన అన్ని రకాలుగా సహకరిస్తున్నట్టు కామెంట్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత ఇప్పుడు పూజ హెగ్డే సినిమా నుండి తప్పుకున్నట్టు బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది.
గుంటూరు కారం సినిమా ఆలస్యం కావడంతో పూజ తన వేరే సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది దానివల్లే ఈ సినిమా నుండి తప్పుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై ఇంతవరకు సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ గానీ అలాగే త్రివిక్రమ్ కానీ స్పందించలేదు.

అంతేకాకుండా పూజా ఈ సినిమా కోసం 60 నుండి 70 రోజులు డేట్స్ ఈ సినిమాకి కేటాయిస్తే, ఒక్కరోజు కూడా షూటింగ్ అవలేదు అని తెలిసింది. మరి రాబోయే రోజుల్లో పూజ హెగ్డే గుంటూరు కారం సినిమా నుండి తప్పుకుంటుంది అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగు జూన్ 23 నుండి దాదాపు 20 రోజులపాటు హైదరాబాదులో జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది.