Colors Swathi emotional words on Month of Madhu Press meet, Actress Swathi fire on website reviews, Swathi hot images, Colors Swathi latest video viral.
కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తను చిన్నతనం నుండి టెలివిజన్ షోతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకోగా ఆ తర్వాత వెండితెరపై కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న కలర్ స్వాతి ఇప్పుడు మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో మళ్లీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా అక్టోబర్ 6 అనగా నిన్న విడుదల కాక సినిమాపై కొన్ని వెబ్ సైట్స్ రాసిన రివ్యూస్ మీద ఈరోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కలర్ స్వాతి అసహనాన్ని వ్యక్తం చేసింది. మంత్ ఆఫ్ మధు (Month of Madhu) సినిమా ప్రెస్ మీట్ లో కలర్స్ స్వాతి (Color Swathi) మాట్లాడుతూ, హీరోయిన్గా టాలీవుడ్ లోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిందే, అలాగే నేను కూడా ఆ విమర్శల్ని చాలా రోజులు ఎదుర్కొన్నాను.. దానితోపాటు చాలా బాధపడటం కూడా జరిగింది..

ముఖ్యంగా ఒక వెబ్ సైట్ గురించి తను మాట్లాడుతూ.. వాళ్ళు రాసిన రాతలు చాలా బాధ కలిగిచ్చేవని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ వెబ్ సైట్ చూడడమే మానేశాను అంటూ చెప్పుకు వచ్చింది. దానితోపాటు స్వాతి (Swathi) మాట్లాడుతూ… ఇంత టార్గెట్ గా ఎందుకు రాస్తారో అర్థం కాదు అంటూ.. ఆ వెబ్ సైట్ కి సంబంధించిన అలాగే దానిలో పని చేస్తున్న వారిపై అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఆ వెబ్ సైట్ వాళ్లు నాతో మాట్లాడలని అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు అంటూ అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంటే చెప్పండి నేను మాట్లాడతాను అని అడగటం కూడా జరిగింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇప్పుడైనా ఆ వెబ్ సైట్ రాతలు రాయటం మానుకుంటదా లేదంటే దీన్ని కూడా వక్రీకరించి వేరే రకంగా రాతలు రాస్తుందా అనేది చూడాలి.