Tollywood Hero and famous comedian Sunil  Admitted In Hospital At Gachibowli
Tollywood Hero and famous comedian Sunil  Admitted In Hospital At Gachibowli

(Tollywood Hero and famous comedian Sunil  Admitted In Hospital At Gachibowli)ప్రముఖ కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. సునీల్ ను అభిమానించే కొంతమంది అభిమానులు ఈ వార్త తెలిసినప్పటి నుండీ కలవరపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా సునీల్ కు మెసేజ్ లు చేస్తున్నారు. దీంతో వెంటనే సునీల్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సునీల్‌ను మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్లే సునీల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వారం రోజులుగా సునీల్ ఈ సమస్యతో బాధపడుతున్నారట. ప్రస్తుతం సునీల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సునీల్ వ్యక్తిగత సిబ్బంది మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, సీజనల్‌గా వచ్చే జ్వరమే అని చెబుతున్నారు.