Complaint filed against actress Sanjana Galrani went for Mahesh babu film
Complaint filed against actress Sanjana Galrani went for Mahesh babu film

(Complaint filed against actress Sanjana Galrani went for Mahesh babu film)హీరోయిన్ సంజన కొన్ని “బుజ్జిగాడు” తదితర తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సంజన సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్‌గా బెంగళూరులోని ఓ పబ్‌లో రచ్చ చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాజాగా మరోసారి బెంగళూరు పోలీసులకు చిక్కింది.

వివరాల్లోకెళ్తే.. రీసెంట్‌గా మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లింది సంజన ఆ క్రమంలో ఆమె కారు డ్రైవ్ చేసింది. అలా డ్రైవ్ చేసేటప్పుడు తనకు మహేశ్ అంటే ఎంతో ఇష్టమని.. మహేశ్ నటించిన సినిమాను చూడటానికి వెళుతున్న ఆనందం తట్టుకోలేకపోతున్నానంటూ డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేసింది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడటం, సెల్ఫీ వీడియో దిగటం వంటి చట్టరీత్యా నేరం కావడంతో బెంగళూరు పోలీసులు ఈ బ్యూటీకి నోటీసులు పంపారు. మరి సంజన పోలీసులకు ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.