యాంకర్ అనసూయకు కరోనా పాజిటివ్

0
518
యాంకర్ అనసూయకు కరోనా పాజిటివ్
యాంకర్ అనసూయకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉన్నదో చెప్పక్కర్లేదు.  కరోనాకు వారువీరు అనే తేడా లేదు.  ఎవరికైనా సోకవచ్చు.  ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలు, రాజకీయనాయకులు  కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె, అనసూయ భరద్వాజ్ తనలో కోవిడ్ లక్షణాలు కనిపించాయని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

 

ఉదయం కర్నూలులో ఓ ప్రోగ్రాంకు హాజరయ్యేందుకు బయలుదేరగా కరోనా లక్షణాలు కనిపించాయని, వెంటనే ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసుకున్నన్నానని, తన కుటుంబ సభ్యులతో కలిసి కరోనా టెస్టు చేయించుకుంటానని తెలిపింది.  తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు చేయించుకోవాలని పేర్కొంది అనసూయ.  ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Previous articleవిడుదలైన ‘లవ్ స్టోరీ’ టీజర్ – ఏందిరా వదిలేస్తావా నన్ను
Next articleక్రాక్ మూవీ రివ్యూ – ఆకట్టుకొనే మాస్ బొమ్మ