Salaar: ప్రభాస్ హెయిర్ స్టైల్ కి 4 లక్షలు…?

0
37
costly hairstyle for Prabhas in Salaar film

Prabhas Salaar: భారతీయ సినిమాలో రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ‘సాలార్’ ఒకటి.  ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో ప్రభాస్‌కు స్టైలిష్ మేక్ఓవర్ ఇవ్వబోతున్నాడు. సలార్ లో హెయిర్ స్టైయిల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారనేది హాట్ టాపిక్ గ మారింది ఇప్పుడు.

అందుతున్న సమాచారం మేరకు  సలార్ లో ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసం బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ రంగంలోకి దిగారట. ఈ స్పెషల్ హెయిర్ స్టైల్ నిమిత్తం నాలుగు లక్షలు ఖర్చుపెడుతున్నారని సమాచారం. ఈ సినిమా అంతా యాక్షన్ నేపథ్యంలోనే సాగనుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్‌గా మారుతోంది.  2022 ఏప్రిల్ 14న సాలార్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కరోన థర్డ్ వేవ్ లేకపోతే అనుకున్న టైం కి రిలీజ్ చేసే అవకాశాలు వుంటుంది. హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.