హైదరాబాద్ డిస్ట్రిక్ కన్సూమర్ డిస్పూట్ కమిషన్ ప్రముఖ టికెటింగ్ వ్యవస్థ బుక్ మై షోతో పాటు మల్టీప్లెక్స్ ఛైన్ పివిఆర్ సినిమాకు పెనాల్టీ విధించింది. అధిక ఇంటర్ నెట్ ఛార్జెస్ ను కస్టమర్స్ నుంచి వసూలు చేసినందుకు గాను ఈ సంస్థలు ఫైన్ కట్టవలసి వచ్చింది.
2019లో హైదరాబాద్ కి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా విచారణ చేపట్టి… 25 నెలల ప్రొసీడింగ్స్ తర్వాత ఫిర్యాది దారునకు 5వేల కోర్టు ఖర్చులుతో పాటు బుక్ మై షో, పివీఆర్ సంస్థలు ఒక్కొక్కటి 25 వేల కాంపన్ సేషన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
లిటిగేషన్ ఖర్చుకింద విజయ్ గోపాల్ కు అదనంగా 1000 కూడా చెల్లించాలని చెప్పింది కోర్టు. ఇంత జరిగినా బుక్ మై షో సంస్థ కరెంట్ బుకింగ్ మీద అధిక ఇంటర్నరెట్ ఛార్జీలు వసూసు చేస్తూనే ఉంది. మళ్ళీ ఎవరైనా కంప్లైట్ చేస్తే బుక్ మై షో చిక్కుల్లో పడటం ఖాయం.