court stay order released for Akhil Agent OTT Release date, Agent OTT Release Date, Sony Live OTT confirmed Agent premiere date,
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఏజెంట్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాని ఓటీపీలో విడుదల చేయుటకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్ కానీ అనుకోని కారణాలవల్ల చాలాసార్లు విడుదల పోస్ట్ పోన్ జరుగుతూనే వస్తుంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు.
ఏజెంట్ చిత్రం ఓటిటి రైట్స్ ని సోనీ లీవ్ ప్లాట్ఫార్మ్ వాళ్ళు దక్కించుకున్న విషయం తెలిసిందే. సోనీ లివ్ ఓటిటి సంస్థ సెప్టెంబర్ 29న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాపై విశాఖపట్నం కి చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగింది. . మొదటి దగ్గర నుండి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర అలాగే డిస్ట్రిబ్యూటర్ మధ్య ఈ సినిమా గురించి చాలానే వాదనలు జరిగాయి.
అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయం లో అన్యాయం జరిగిందని, నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ న్యాయం కోరుతూ వైజాగ్ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లో వేసిన కేసు నిన్న తీర్పురాటం జరిగింది.. ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఈ నెల 29 న ఏజెంట్ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే ఇచ్చిందని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు.