బండ్ల గణేష్‌ పవర్ స్టార్ సినిమా అదేనా?

0
531
crazy news on pawan kalyan trivikram bandla ganesh combination

Pawan kobali movie: Bandla Ganesh: ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గతంలో ఆగిపోయిన కోబలి ప్రాజెక్ట్ అని వార్తలు షికార్లు చేస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. మళ్ళీ అదే రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.అయితే ఈ సినిమా వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలను బండ్ల గణేష్ వెల్లడించలేదు.

అయితే ఈ సినిమాలో టాలీవుడ్‌లో అప్పుడే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్‌తో ‘కోబలి’ పేరుతో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇటీవల పవన్‌ మళ్లీ బిజీగా మారడంతో ‘కోబలి’ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు బండ్ల గణేష్‌ పవన్‌తో మూవీ అనౌన్స్ చేయగానే అది ‘కోబలి’ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

బండ్ల గణేష్ పవన్ తోనే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా క్లోజ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు బండ్ల గణేష్ పవర్ స్టార్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ‘కోబలి’ అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నాడు. దీని తర్వాత ‘కోబలి’ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నారు. ఈ వార్త నిజమే అయితే పవన్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.

Previous article‘కరోనా వైరస్’ని రంగంలోకి దించిన ఆర్జీవీ..!
Next articleNithiin Check movie first look poster out