‘రాధే శ్యామ్’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్..!

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.

రాధే శ్యామ్ సినిమాను కూడా రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. ‘రాధే శ్యామ్’ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని.. ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని అందరూ చెబుతూ వస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో ప్రేమ కథతో పాటుగా అందరినీ ఆశ్చర్యపరిచే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. లవ్ డ్రామా అనేది ప్రధాన ఇతివృత్తంగా ఉన్నప్పటికీ.. థ్రిల్ కలిగించే కోణం ఉందని చెబుతున్న వార్తలు ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ – ప్రమోద్ – ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకున్నాడు. వీటితో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్’ ఓ భారీ సినిమా ని చేస్తున్నాడు..

Related Articles

Telugu Articles

Movie Articles