Criminal complaint against Arjun Reddy lady Shalini Pandey
Criminal complaint against Arjun Reddy lady Shalini Pandey

(Criminal complaint against Arjun Reddy lady Shalini Pandey) అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి లో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన ముఖం లోని అన్ని హావభావాలను పండించి తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది ఈ అమ్మడు. ఇక హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుని దూకుడు చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడి మాత్రం అంతగా అవకాశాలు అందిపుచ్చుకునే లేకపోయింది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన 118 సినిమా లో నటించింది ఈ అమ్మడు… మహానటి లో కూడా ఓ పాత్రలో నటించింది. అంతకుమించి అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి దక్కలేదు. అటు ఈ అమ్మడికి జోడిగా నటించిన విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ హీరోగా మారిపోయాడు.

ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసిన షాలిని ..రణ్‌వీర్ సింగ్‌ పక్కన జయేశ్ భాయ్ జోర్దార్‌లో నటిస్తోంది. ఇక తమిళంలో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షాలిని. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు ఓ సినిమాను సంతకం చేసింది షాలిని పాండే . కొన్ని వారాల పాటు సజావుగా సెట్స్ కు వెళ్ళి షూటింగ్ లో పాల్గొన్న ఈ అమ్మడు…ఆ తర్వాత షూటింగ్ ఎగవేతకు పాల్పడుతుందంటూ శాలిని పాండే పై చిత్ర బృందం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చిత్ర నిర్మాత శివ శాలిని పాండే పై పోలీసులకు ఫిర్యాదు చేశారట… దీంతో షాలిని పాండే పై క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. అయితే షాలిని పాండే పై అంతకుముందే తెలుగు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కోసమే దక్షిణాది సినిమాలను శాలిని పాండే పక్కన పెడుతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజా ఘటనతో శాలిని పాండే నిజంగానే దక్షిణాది సినిమాలను పక్కన పెడుతుందని వస్తున్న వార్తలకు బలం చేకూరింది.