Cult Mama song from Skanda: బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని స్కంద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ అలాగే టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేటట్టు చేశాయి. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రమోషన్ లా భాగంగా ఈ సినిమా నుండి కల్ట్ మామ అనే మాస్ సాంగ్ ని విడుదలకు సిద్ధం చేశారు.
Cult Mama song from Skanda: ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి మరియు ట్రైలర్ బోయపాటి స్టైల్‌లో యాక్షన్-ప్యాక్డ్ చిత్రంగా హామీ ఇస్తుంది. ‘కల్ట్ మామా’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాట రామ్‌లోని హై ఎనర్జీతో పాటు ఊర్వశి రౌతేలా మెరిసే గ్లామర్‌తో రాబోతున్నట్టు పోస్టర్ని చూస్తే తెలుస్తుంది. సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గణేష్ చతుర్థి రోజున ఈ పాటను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘స్కంద’ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా, రత్నం డైలాగ్స్ రాశారు.
థమన్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ డిటాకే సినిమాటోగ్రాఫర్. స్టన్ శివ యాక్షన్ డైరెక్టర్ కాగా, తమ్మి రాజు ఎడిటర్. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు.