Homeసినిమా వార్తలుకష్టాలలో కస్టడీ మూవీ..ఘోరమైన కలెక్షన్స్..!

కష్టాలలో కస్టడీ మూవీ..ఘోరమైన కలెక్షన్స్..!

Custody movie today collection, custody movie collection till now, Naga Chaitanya, Krithi Shetty, Custody movie box office collection report, Custody worldwide share, Custody movie business

Custody box office collection: తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి అక్కినేని కుటుంబం అంటే ఉన్న అభిమానం లేవలే వేరు . నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగార్జున వరకు ఆ కుటుంబం నుంచి వచ్చిన రెండు తరాల హీరోలు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల గా వెలుగొందారు. అయితే ఈ తరానికి వారసులుగా వచ్చిన నాగచైతన్య మరియు అఖిల్ ఇద్దరు సక్సెస్ సాధించలేదు అని చెప్పవచ్చు. నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోలు తెచ్చుకున్న పార్టీ బ్లాక్ బస్టర్లు కూడా ఈ ఇద్దరి ఖాతాలో కలిపి లేకపోవడం విడ్డూరం.

Custody collection: గత కొద్ది కాలంగా కెరియర్ లో ఎత్తుపల్లాలు చూస్తున్న నాగచైతన్య ఎన్నో ఆశల మధ్య విడుదల చేసిన చిత్రం కస్టడీ. విడుదలకు ముందు ఈ చిత్రం మీద అంచనాలు విపరీతంగా నెలకొన్నాయి. ధ్రువ చిత్రంలో విలన్ గా నటించి మూవీకి హైలైట్ గా నిలిచినా రవీంద్రస్వామి కస్టడి మూవీలో తిరిగి విలన్ పాత్ర పోషించడం.. ఇందులో చైతన్య పోలీస్ క్యారెక్టర్ లో నటించడం…వీటన్నిటిపై రకరకాల సృష్టించి చిత్రానికి హైపునైతే ఇవ్వగలిగారు.

కానీ రిలీజ్ అయ్యాక మాత్రం మూవీ మిక్స్డ్ టాక్ తో మొదలై ప్రస్తుతం తీవ్రమైన నిరాశను ఎదుర్కొంటోంది. వినూత్నంగా ద్విభాషతో ట్రై చేసినప్పటికీ కస్టడీ ఓ కొలిక్కి రాలేకపోతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ఇరు తెలుగు రాష్ట్రాలలో 18.20 కోట్లు, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.20 కోట్లు , ఓవర్సీస్ లో 2.40 కోట్లు అలాగే తమిళ్ వెర్షన్ లో 2 .25 కోట్లు.. ఇలా అంతా కలుపుకొని ఇప్పటికి కేవలం 24.05 కోట్ల బిజినెస్ సాధించింది.

Custody movie collection till now

హాలిడే సీజన్ అయినప్పటికీ కలెక్షన్స్ లో పెద్ద ప్రభావం ఏమీ లేకపోవడం చిత్రం ప్రేక్షకులను ఎంతగా నిరాశపరిచింది అనేదానికి ఉదాహరణ. ఈ మూవీ స్టార్టింగ్ నుంచే వసూలు తక్కువ అని చెప్పవచ్చు… మధ్యలో సండే వీకెండ్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పై ఎటువంటి ప్రభావము లేదు. సో నాగచైతన్యకు ఈసారి కూడా లక్కు కలిసి రాలేదు అని చెప్పవచ్చు.

Web Title: Custody movie today collection, custody movie collection till now, Naga Chaitanya, Krithi Shetty, Custody movie box office collection report, Custody worldwide share, Custody movie business

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY