Custody Movie Review: తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు మరియు నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ‘కస్టడీ’ చిత్రం ఈరోజు విడుదల అయింది. ఇందులో అరవిందస్వామి స్ట్రాంగ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ అన్ని చిత్రం పై అంచనాలను పెంచాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం…
Custody Telugu Review & Rating: 2.5/5
నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : ఎస్ఆర్ కతీర్
సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు
విడుదల తేదీ: మే 12, 2023
కథ: సఖినేటిపల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్ అయినటువంటి శివ (నాగ చైతన్య) ఓ అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం ఏకంగా సీఎం దాక్షాయిని (ప్రియమణి) కాన్వాయ్ ని ఆపి వార్తల్లోకి ఎక్కి పాపులర్ అవుతాడు. మరోపక్క శివ ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)కు ఇద్దరి కులాలు వేరు అన్న కారణం చేత వేరే అబ్బాయితో (వెన్నెల కిశోర్) పెళ్లి నిశ్చయం అవుతుంది .ఈ పెళ్లి ఇష్టం లేని రేవతి తనను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటుంది.
శివ రేవతిని తీసుకురావాలి అనుకునే సమయానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి రాజున(అరవింద్ స్వామి) ని సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తారు. అదే సమయానికి అక్కడ డ్యూటీలో ఉన్న శివకు రాజును చంపేస్తున్నారు అన్న విషయం అర్థమై …ఎలాగైనా రాజును కోర్టులో అప్పగించి న్యాయాన్ని గెలిపించాలి అని ఆరోజు రాత్రి రేవతి తో పాటు రాజును కూడా తీసుకువెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి కోసం గాలించడం మొదలు పెడతారు.
రాజును చంపడానికి పోలీస్ కమిషనర్ నటరాజన్ ( శరత్ కుమార్) తో పాటు మొత్తం పోలీస్ ఫోర్స్ అలాగే రౌడీలు అందరూ రంగంలోకి దిగుతారు. అసలు రాజు ఎవరు? అతన్ని చంపడానికి అందరూ ఎందుకు వెతుకుతున్నారు? శివరాజును తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? దారిలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఎటువంటి? ఒక సాధారణమైన కానిస్టేబుల్ అయిన శివ క్రిమినల్ అయిన రాజు చావకూడదు అని ఎందుకు ప్రయత్నించాడు? తెలియాలి అంటే ఈ చిత్రాన్ని తెర పైన చూడాల్సిందే.
విశ్లేషణ : టిపికల్ స్క్రీన్ ప్లే మూవీస్ తీయడంలో వెంకట ప్రభువు ఆరితేరిన వ్యక్తి. మామూలుగా అతను తీసే కథలో మలుపులు ఊహకు అందని విధంగా బాగా థ్రిల్ ఇస్తాయి. అయితే కస్టడీ మూవీలో ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. స్టోరీ నార్మల్ రివెంజ్ డ్రామా లాగా కనిపిస్తుంది. సినిమా మొత్తం ఎట్టి పరిస్థితుల్లో విలన్ చావకూడదు అని హీరో చేసే ప్రయత్నం మెయిన్ కాన్సెప్ట్ గా నడుస్తుంది. ఈ మూవీలో వెంకట ప్రభువు స్టైల్ అయితే కనిపించలేదు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆశించినంత రేంజ్ లో లేదు అని చెప్పవచ్చు. మూవీలో థియేటర్ నుంచి బయటకు వచ్చాక …అబ్బా ఏముందిరా ఈ పాట అని గుర్తు పెట్టుకునే రేంజ్ సాంగ్ ఒకటి కూడా లేదు. నాగచైతన్య సవ్యసాచి మూవీ లో సవ్యసాచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసలు గూస్ బుంప్స్ తెప్పిస్తుంది. అలాంటి మంచి సాంగ్ ఈ మూవీలో మిస్ అయింది అని చెప్పవచ్చు.
మూవీలో స్టోరీ నిదానంగా ఈజీ గెస్సింగ్ తో ముందుకు సాగుతుంది. అక్కడక్కడ బాగా డ్రాగింగ్ అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్ గా ఉండడంతో పాటు సినిమాకి అవసరమైన ఎమోషన్ ని క్యారీ చేయలేదు అని చెప్పవచ్చు. మూవీ మరీ అంత గొప్పగా లేకపోయినప్పటికీ చూడడానికి కంఫర్టబుల్గా ఉంది. ఇంటర్వెల్ ముందు వరకు ఓ రేంజ్ లవ్ స్టోరీ మరియు కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్: జనరల్ గానే వెంకట ప్రభువు మూవీ అంటే ప్రత్యేకంగా హీరో క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. కేవలం ఆ వ్యక్తి క్యారెక్టర్జేషన్ హైలెట్ అవుతుంది. కస్టర్డై మూవీలో నిజంగా చెప్పాలి అంటే అరవింద స్వామి క్యారెక్టర్ హైలెట్ అని చెప్పవచ్చు. నిజానికి చేసింది ఒక క్రిమినల్ క్యారెక్టర్ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలలో అతని ఆక్టింగ్ మరియు డైలాగ్స్ సూపర్ కామెడీ జనరేట్ చేస్తాయి.
నాగచైతన్య తను పోషించిన శివ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు అని చెప్పవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో లాంగ్ హెయిర్ స్టైల్ తో సడన్గా చూస్తే నాగచైతన్యను ఎవరైనా నాగార్జున గుర్తుకు వస్తాడు.కానిస్టేబుల్ క్యారెక్టర్ లో చైతన్య పర్ఫామెన్స్ ఇరగదీసింది. అసలు కొన్ని సీన్స్ లో అయితే చైతన్య పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉంది అని చెప్పవచ్చు. ఫ్లాష్ ప్యాక్ లో నాగచైతన్య బ్రదర్ క్యారెక్టర్ కి తమిళ్ హీరో జీవా మరియు అతని లవర్ గా ఆనంది గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారు.
హీరోయిన్ గా కృతి శెట్టి రోల్ కూడా ఓకే అని చెప్పవచ్చు. మరోపక్క ప్రియమణి పాత్ర సీఎంగా కాస్త పరిధి తక్కువ అనిపిస్తుంది అయినా ఉన్నంతలో బాగా చేశారని చెప్పవచ్చు. మన వంటలక్క అదే ప్రేమీ విశ్వనాథ్ ఓ సన్నివేశంలో కనిపించి అందరిని అలరించారు. మిగిలిన అందరూ తమ వంతు పర్ఫామెన్స్ చేశారని చెప్పవచ్చు కానీ సినిమా మొత్తానికి నాగచైతన్య మరియు అరవిందస్వామి మెయిన్ పిల్లర్స్ అనడం బాగుంటుంది.
ప్లస్ పాయింట్స్:
- చైతు యాక్షన్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్.
- రాజు క్యారెక్టర్ అరవింద స్వామి తప్ప ఎవరూ చేయలేరు అనే రేంజ్ లో అరవింద స్వామి పర్ఫామెన్స్ ఉంది.
- ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది.
మైనస్ పాయింట్స్:
- మూవీ కాస్త రొటీన్ గా అనిపిస్తుంది.
- చిత్రంలో ఎక్కడా మెస్మరైజ్ చేసే సాంగ్స్ లేవు.
- నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసే విధంగా కాస్త సాగదీతగా ఉంది.
తీర్పు: ఫ్యామిలీతో వీకెండ్ ఓ మంచి సినిమా ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకునే వాళ్ళకి కస్టడీ డీసెంట్ మూవీగా అనిపిస్తుంది. మరి ఫ్యాసినేట్ చేసే అంత ఎలిమెంట్స్ ఏమీ లేనప్పటికీ కథపరంగా మూవీ ఓకే అని చెప్పవచ్చు. చెప్పాలి అంటే ఈ మూవీ స్లో గా ప్రేడిక్టబుల్ నారేషన్తో సాగుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ పెర్ఫార్మెన్స్ 50 50 అని చెప్పవచ్చు.