Custody Pre Release Business and Box office Target: నాగార్జున నటవారు సుడిగా మూవీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తొలుత మంచి సక్సెస్ అందుకున్న తర్వాత కాస్త తడబడి మళ్లీ తిరిగి నిలబడిన హీరో నాగచైతన్య. తన రాబోతున్న సినిమా కస్టడీ బిజినెస్ (Custody Business) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Custody business and box office target: ప్రస్తుతం ఉన్న అందరూ అక్కినేని హీరోలలోకి మంచి ఫ్యాన్ వేస్ట్ ఉన్న ఏకైక వ్యక్తి యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) అని చెప్పవచ్చు. వరుస హిట్లు తెచ్చుకున్న అతడు గత సంవత్సరం రిలీజ్ అయిన థాంక్యు తో ఓ డిజాస్టర్ ను చవి చూశాడు. దాంతో కాస్త టైం తీసుకుని మంచి కాన్సెప్ట్ తో కస్టడీ (Custody) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ మూవీని కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వెంకట ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు తమిళం లో ఒకేసారిగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రస్తుతానికి అంచనాలు భారీగానే ఉన్నాయి. నాగచైతన్య కెరీర్ కి కూడా కస్టడీ (Custody) చిత్రం ఎంతో ముఖ్యం కాబట్టి అక్కినేని అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగచైతన్య నటిస్తున్న స్ట్రైట్ తమిళ్ మూవీ కస్టడీ (Custody) కాబట్టి ఇది క్లిక్ అయితే అటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాగచైతన్య హవా నడిచే అవకాశం ఉంది.
ఇన్ని భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ కు రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది. దాంతో చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ కు (theatrical rights) మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంతో అనుకుంటున్నారా…నైజాంలో ఏడున్నర కోటి సీడెడ్ లో 2.20 కోట్లు.. మిగిలిన ప్రాంతాలు అంతా కలిపి ఎనిమిదిన్నర కోటి వరకు బిజినెస్ జరిగింది. అంటే సుమారున రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 18.20 కోట్లు ఒక్క థియరిటికల్ బిజినెస్ (theatrical business) అయింది.
ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ 2.40 కోట్ల వరకు పలికాయి అలాగే కర్ణాటక మరియు మిగిలిన ప్రాంతాలలో అంతా కలిపి 1.20 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే మొత్తానికి 21.80 కోట్ల బిజినెస్ను కస్టడీ (Custody) విడుదలకు ముందే జరుపుకుంది ఇక మరొక 22.50 కోట్లు కాన వసూలు చేయగలిగిందంటే మూవీ క్లీన్ హిట్ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నారు.
మరోపక్క పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ లో అరవింద స్వామి ఈ మూవీకి హైలైట్ గా నిలవబోతున్నారు. శరత్ కుమార్ మరియు ప్రియమణి ఈ చిత్రంలో మోస్ట్ ప్రామినెంట్ పాత్రలు పోషిస్తున్నారట. ఈ చిత్రం నాగచైతన్య ఖాతాలో మరో భారీ విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అనేది రిలీజ్ అయితేనే తెలుస్తుంది…
Web Title: Naga Chaitanya, Krithi Shetty, Custody movie, Custody Business, Custody Box office Target, Custody movie Pre release Business, Custody is all set to hit theaters on May 12th.