Sai Dharam Tej Accident Case: మెగాహీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) యాక్సిడెంట్ గురైన విషయం మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 10 తారీఖున బైక్ యాక్సిడెంట్ (Bike Accident Case) కి గురై ఆస్పత్రిలో చేరి అలాగే భుజానికి శాస్త్ర చికిత్స అనంతరం ఇంటికి తిరిగి రావటం జరిగింది. అయితే అప్పుడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది.
ఇప్పుడు సాయి తేజ్ (Sai Tej) యాక్సిడెంట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత నోటీసులు పంపినట్లు చెప్పడం జరిగింది. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బైక్ యాక్సిడెంట్ విషయమై పలు కీలక విషయాలను వెల్లడించారు. తేజు కోలుకున్న తరువాత 91 CRPC కింద నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
అయితే ఇప్పుడు ఆ కేసు నిమిత్తమై నోటీసులకు ఎటువంటి సమాధానం రాలేదంటున్నారు. గతంలోనే సాయి తేజ్ (Sai Tej) కు నోటీసులు ఇచ్చామన్నారు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం.. కాని ఇంత వరకూ.. సాయి తేజ్ (Sai Tej) దగ్గర నుంచి ఎటువంటి వివరణ రాలేదన్నారు. అందుకే త్వరలో చార్జ్ షీట్ ఫైల్ చేయనున్నట్టు తెలిపారు.
దాదాపు రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న సాయి తేజ్ (Sai Tej) ఇప్పుడిప్పుడే కోలుకొని కొత్త సినిమా కూడా షూటింగ్ కి ప్రారంభించటానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో జరిగిన క్రిస్ మస్ వేడుకల్లో కూడా సందడి చేశారు సాయి తేజ్ (Sai Tej). ఇదే తరుణంలో ఈ కేసు మళ్లీ తెరపైకి రావటం వివాదంగా మారింది.