Daaku Maharaaj Movie Highlights: నటసింహం బాలయ్య – బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, దర్శకుడు బాబీ సినిమాలో ప్రధాన హైలైట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బాబీ మాట్లాడుతూ, “డాకు మహారాజ్‌లో (Daaku Maharaaj) ఐదు నుంచి ఆరు సాలిడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బాలకృష్ణ (Balakrishna) గారి సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో, వాటన్నింటినీ ఈ సినిమాలో తీసుకొచ్చాం. ముఖ్యంగా, బాలయ్య గారి పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఆ మూడో వేరియేషన్ కోసం ప్రత్యేకంగా ఒక బెస్ట్ ఎపిసోడ్ డిజైన్ చేశాం, ఇది సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుంది” అని తెలిపారు.
అలాగే, బాబీ ఇంకో ఆసక్తికర విషయం చెప్పుతూ, “ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాకుండా, బాలకృష్ణ గారి నుంచి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను చూడొచ్చు. ఆయన పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఒక 30 నిమిషాల ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఇంత అందమైన ఎమోషన్‌ను ఎలా పండించామో మీరు ఆశ్చర్యపోతారు” అన్నారు.
“డాకు మహారాజ్” సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ సమర్పణలో ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్‌గా రాబోతున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా, బాలయ్య అభిమానులకు పండుగ వాతావరణం తీసుకురానుందని ఆశిస్తున్నారు.