ఫోటో స్టోరీ: రానా- మిహీక హనీమూన్ ట్రిప్..!

0
369
daggubati rana- miheeka bajaj honeymoon trip photos viral on social media

miheeka bajaj: Rana Daggubati: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఆగష్టు 8న జరిగిన వివాహ వేడుకలో తన ప్రేయసి మిహికా బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. రానా- మిహీక హనీమూన్ ట్రిప్‌లో చిల్ అవుతున్నారు. విదేశాల్లో షికార్లు కొడుతున్న ఈ జంట.. బీచ్‌లో హాయిగా సేద తీరుతూ సెల్ఫీ దిగడంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ లభించిందని పేర్కొంటూ ప్రేయసి మిహీక బజాజ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రానా.. లాక్‌డౌన్ వేళ ఆగస్టు 8వ తేదీన ఆమె మెడలో మూడు ముళ్ళేసి భార్యగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కరోనా కారణంగా ఇన్నిరోజులు ఇంట్లోనే ఉన్న ఈ జోడీ.. ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌లో చిల్ అవుతున్నారు. స్వేచ్ఛగా బయటకు వెళ్లి తమకిష్టమైన ప్రదేశాల్లో షికార్లు కొడుతున్నారు.

‘జస్ట్ బికాజ్ రానా’ అంటూ మిహికా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరు ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ ఏదో వెల్లడించనప్పటికీ.. రానా మిహికాలు సాధారణంగా బీచ్ లో ధరించే దుస్తుల్లో కనిపిస్తున్నారు. బీచ్‌లో అలా పడుకుని ఏదో ముచ్చటిస్తున్న తన సతీమణి మిహికాను సెల్ఫీలో బంధించారు రానా. ఇక ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన మిహీక.. రానా కోసమే ఇలా అన్నట్లుగా హాట్ కామెంట్ జోడించింది.

View this post on Instagram

Just because 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on