శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సాయం..!

0
63
Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family
Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family

Chiranjeevi – Shiva Shankar Master : మెగాస్టార్ చిరంజీవి సినీ కళాకారులకు ఎటువంటి ఆపద వచ్చినా అలాగే ఎటువంటి సహాయం కావాలన్నా ముందు వరుసలో ఉండే వ్యక్తి. ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) గారు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ (Shiva Shankar Master) కి కరోనా సోకి హాస్పటల్లో ఉన్నారు.

అలాగే కే శివ శంకర్ (Shiva Shankar Master) పెద్ద కుమారుడు కూడా కరోనా సోకిన వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకొని చలించిపోయిన చిరంజీవి గారు, శివశంకర్ చిన్న కుమారుడు అజయ్ ను పిలిచి.. తనవంతు సాయంగా రూ.3లక్షల చెక్కును అందించారు.

Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family
Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family

ఆయన ఆరోగ్య పరిస్థితిపై అజయ్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏమాత్రం అధైర్య పడొద్దని..తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ ‘‘నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం.

చిరంజీవి గారితో నాన్న‌గారు సినిమాలు చేశారు. ఇటీవల ఆచార్య సినిమాలోనూ చిరంజీవిగారితో నాన్న‌గారు క‌లిసి వ‌ర్క్ చేశారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి నాకు చాలా అవసరం. చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు.

Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family
Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family

కరోనా కారణంగా..ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న సోనూసూద్ (Sonu Sood) కూడా తన వైద్య ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అలాగే తమిళ్ యాక్టర్ ధనుష్ (Hero Dhanush) కూడా 10 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేశారు. సోషల్ మీడియాలో ఈ ఈ న్యూస్ వైరల్ కావడంతో వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేస్తున్నారు.

 

Web Title: Shiva Shankar Master COVID positive – Sonu Sood, Danush and Chiranjeevi Helped to Shiva Shankar Master family, Dance Choreographer Shiva Shankar Master

Previous articleMohanlal Marakkar Completed Censor Formalities
Next articleRajamouli Special Guest For Balayya Akhanda Event