'Darbar' released on TV - Lyca Productions lodge complaint
'Darbar' released on TV - Lyca Productions lodge complaint

(‘Darbar’ released on TV – Lyca Productions lodge complaint)సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. తలైవా కుమార్తెగా నివేదా థామస్‌ నటించారు. జనవరి 9న వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. సినిమా తొలి వారాంతంలో రూ.128 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

ఇటీవల విడుదలైన రజనీకాంత్ ‘దర్బార్‌’ మూవీ రిలీజైన నాలుగు రోజులకే టీవీలో ప్రసారమైంది. దీంతో ప్రొడ్యూసర్స్ కంగుతిన్నారు. తొలుత చిత్ర హెచ్‌డీ వెర్సన్ లింక్ వాట్సాప్‌లో సర్కులేట్ అయింది. దానికి తోడు అందరికి షేర్ చెయ్యమని ఓ వాయిస్ మెసేజ్‌ కూడ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఊహించని విధంగా ఈ నెల 12న శరణ్య టీవీ నిర్వాహకులు మూవీ పైరసీ ప్రింట్‌ను జవనరి 12వ తేదీ మదురైలో ప్రసారం చేశారు. దీనిపై ‘దర్బార్‌’ మూవీ ప్రొడ్యూస్ చేసిన లైకా ప్రొడక్షన్స్‌ తీవ్రంగా ఫైరయ్యింది. టీవీ చానల్‌పై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై చానల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.