‘రాబ‌ర్ట్’ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల‌

242
Darshan's Roberrt motion poster is out

మంచి అంటే రాముడు.. చెడు అంటే రావ‌ణాసురుడు… ఈ రెండు గుణాలు ఒకే యువ‌కుడిలో ఉంటే.. త‌ను ఎలా ఉంటాడు.. అనేది తెలుసుకోవాలంటే ‘రాబ‌ర్ట్’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు. ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాబ‌ర్ట్‌’. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Roberrt - Telugu Teaser out now

“త‌ను ఓర్పులో శ్రీరాముడు.. మాటిచ్చాడంటే ద‌శ‌ర‌థ రాముడు, ప్రేమ‌తో వ‌స్తే జాన‌కి రాముడు, కానీ తిర‌గ‌బ‌డితే.. నేను చ‌తుర్ధ‌శ భువ‌న భ‌యంక‌ర లంకేశ్వ‌ర ద‌శ‌కంఠ రావ‌ణ” అంటూ త‌న‌లోనే రామ‌డు, రావ‌ణుడు ఉన్నాడంటూ తెలియ‌జేసేలా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌లో ద‌ర్శ‌న్ ఎంట్రీ గూజ్ బంప్స్ వ‌స్తున్నాయి. మార్చి 11న సినిమా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త‌రుణ్ కిషోర్ సుధీర్‌
నిర్మాత‌: ఉమాప‌తి శ్రీనివాస్ గౌడ‌, సంగీతం: అర్జున్ జ‌న్యా, సినిమాటోగ్ర‌ఫీ: సుధాక‌ర్ ఎస్‌.రాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: మోహ‌న్ బి.కేరే, ఎడిట‌ర్‌: కె.ఎం.ప్ర‌కాశ్‌, డైలాగ్స్‌: హ‌నుమాన్ చౌద‌రి, పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణి, కాసర్ల‌శ్యామ్‌, యాక్ష‌న్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌, అన్బు అరివు, వినోద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ద‌ర్శ‌న్ ఎస్‌, చిరాగ్..