Das Ka Dhamki Review in Telugu: ఉగాది సందర్భంగా ఈ రోజు విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ దస్ కా ధమ్కీ ఈరోజు విడుదల కావటం జరిగింది. విశ్వక్సేన్ ఈ సినిమాలో నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తుండగా, ధమాకా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కథను అందించారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
Das Ka Dhamki Telugu Review & Rating: 2.5/5
నటీనటులు: విశ్వక్ సేన్-నివేథా పెతురాజ్-హైపర్ ఆది-తరుణ్ భాస్కర్-అక్షర గౌడ్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: దినేష్ బాబు
కథ: ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత: కరాటె రాజు
స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: విశ్వక్సేన్
కథ: ఇక కథలోకి వస్తే..కృష్ణ దాస్(విశ్వక్ సేన్) ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు కానీ తనకి మాత్రం లైఫ్ లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అతడికి ఆ హోటల్లోనే అనుకోకుండా కీర్తి (నివేథా పెతురాజ్) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోయిన కృష్ణ.. తాను ఒక డబ్బున్న వాడిలా నటిస్తూ ఆమెను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు.
అలాగే మరో పక్క ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర(మరో విశ్వక్ సేన్) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. మరి ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు లింక్ ఉంటుందా? లేక వేరే వేరేనా? కథలో సంజయ్ రుద్ర కి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తీ(నివేతా పెత్తురాజ్) ఎవరితో లింక్ ఉంటుంది? ఇలా అనేక ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటులు: విశ్వక్ సేన్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలు చేయటం జరిగింది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ కమర్షియల్ హీరో పాత్రకు కూడా సరిపోతాడని నిరూపించాడు. తన కామెడీ టైమింగ్ అలాగే పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ఇక హీరోతో పాటు హైపర్ ఆది కూడా కరెక్ట్ గా తన క్యారెక్టర్ కి సెట్ అయ్యాడు అని చెప్పాలి ఎందుకంటే ఇద్దరు కామెడీ టైమింగ్స్ సినిమాలో హిలోరియస్ గా ఉంది.
నివేథా పెతురాజ్ కూడా వేరియేషన్ ఉన్న పాత్ర చేసింది. తన పెర్ఫామెన్స్ ఓకే. తెలుగులో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత సెక్సీగా కనిపించింది. అలాగే ఇద్దరి మధ్య వచ్చే రొమాన్స్ కామెడీ టైమింగ్ లో కూడా నివేదా చాలా ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటును తమ పాత్రలకు న్యాయం చేశారు.
తీర్పు : ఈ సినిమాలో విశ్వక్సేన్ నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. . న పెంపులు పొందిన విశ్వక్ డైరెక్టర్ గా మాత్రం రాణించలేకపోయారని చెప్పాలి. ఎందుకంటే కథలు మొదటి దగ్గర నుంచి ప్రారంభమైన ట్విస్టులు చివరి వరకు అలాగే కొనసాగుతూ ఉంటాయి. . సినిమాకి పెద్ద మైనస్ అనటంలో తప్పులేదు. మొదటి భాగంలో సినిమా మొత్తం కామెడీ అలాగే ఎంటర్టైన్మెంట్ ని బాగానే తీసుకు వెళ్లినప్పటికీ రెండో భాగంలో మాత్రం సత్తా లేకుండా పోయింది.
ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు సెకండాఫ్ గురించి చాలా చర్చలు జరిగాయి. సెకండాఫ్ సినిమాకి గ్రిప్టింగ్ అండ్ హైలెట్ గా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. కానీ దాని చుట్టూ క్రియేట్ చేయబడిన అన్ని హైప్‌లకు, సెకండాఫ్ నిజంగా సరైన న్యాయం చేయదు.
ప్రసన్నకుమార్ బెజవాడ అల్లిన కథ బాలేదని చెప్పలేం. అలా అని బాగుందనీ అనలేం. కథలో డ్రామా అనుకున్నంతగా పండలేదు. ప్రేక్షకులకు షాకులు ఇవ్వాలని.. వాళ్లను సర్ప్రైజ్ చేయాలని ఓవర్ డోస్ ట్విస్టులు పెట్టడంతో అంతా గందరగోళంగా అనిపిస్తుంది.
ఇక మొత్తంగా చూస్తే ఈ “దాస్ కా ధమ్కీ” విశ్వక్ నుంచి గాని నివేతా నుంచి కూడా ఆశించే అన్ని అంశాలు కంటే అంతకు మించే ఉంటాయి. అలాగే అక్కడక్కడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు పైగా చాలా ఇంప్రెస్ చెయ్యని ట్విస్ట్ లు బోర్ అనిపిస్తాయి. వీటితో అయితే కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ పండుగకి లేదా వారాంతానికి ఒక్కసారి చూడొచ్చు.