Dasara OTT Release Date & Streaming Partner: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రూరల్ మాస్ యాక్షన్ డ్రామా ‘దసరా’. డెబ్యూ డైరక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అయితే థియేటర్లలో ధూమ్ ధామ్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.
Dasara OTT Release Date & Streaming Partner: ‘దసరా’ అనేది నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో రిలీజైంది. రూ.110 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలానే యూఎస్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుని ఓవర్ సీస్ లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలో నెల తిరక్కుండానే కేవలం నాలుగు వారాలకే డిజిటల్ వేదిక మీదకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.



ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ‘దసరా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఎర్లీ స్ట్రీమింగ్ కు సిద్దమైంది. ఏప్రిల్ 27న హిందీ మినహా నాలుగు దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓటీటీ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో సింగరేణి సమీపంలోని వీర్లపల్లి అనే ప్రాంతంలో జరిగే కథ ‘దసరా’. చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులైన ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి).. మిగతా ఫ్రెండ్స్ తో కలిసి రైళ్లలో బొగ్గు దొంగతనం చేస్తూ వుంటారు. అదే గ్రామంలో అంగన్ వాడి టీచర్ గా పనిచేసే వెన్నెలని (కీర్తి సురేష్) ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా ఆమెనే ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ధరణి.. స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు. అయితే ఆ ఊర్లోని సిల్క్ బార్ మరియు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో విలన్ చిన్న నంబి వాళ్ల జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ధరణి, వెన్నెల, సూరి జీవితాలు ఎలా మారాయి? అనేది మిగతా కథ.
నాని ఈ సినిమాలో ఊర మాస్ పాత్రలో మెప్పించాడు. కీర్తిసురేశ్, రక్షత్ శెట్టి ఇద్దరూ వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో, ఝాన్సీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘దసరా’ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. థియేటర్లలో హిట్టయిన ఈ చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.