Dasara Review in Telugu: నాని అలాగే కీర్తి సురేష్ రెండోసారి కలిసి నటిస్తున్న సినిమా దసరా. ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. దసరా ఫస్ట్ మూవీ రివ్యూ పాజిటివ్ టాక్ బయటకు రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు విడుదలైన దసరా తెలుగు రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి.
Dasara Telugu Review & Rating: 3/5
నటినటులు:నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ తదితరులు
దర్శకత్వం:శ్రీకాంత్ ఓదెల
నిర్మాత:సుధాకర్ చెరుకూరి
సంగీతం:సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ:సత్యన్ సూర్యన్
కథ: దసరా ముగ్గురు చిన్ననాటి స్నేహితుల కథ- ధరణి (నాని), వెన్నెల (కీర్తి), మరియు సూరి (దీక్షిత్). తెలంగాణలోని వీర్‌పల్లి గ్రామంలో 90వ దశకంలో జరిగిన దసరా కథాంశం రాజకీయాలు, బొగ్గు గనులు మరియు సిల్క్ బార్‌ల కారణంగా ఈ జీవితాలు ఎలా చిక్కుకుపోయి శాశ్వతంగా మారిపోతాయనే దాని చుట్టూ తిరుగుతుంది.
వెన్నెలని స్కూల్ లో ఉన్నప్పుడే ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా వెన్నెలనే లవ్ చేస్తున్నాడని తెలిసి.. తన ప్రేమని మనసులోనే దాచేసుకుంటాడు. ఆ తర్వాత చాలా భయస్థుడిగా మారిపోయి మందుకు బాగా అలవాటు అయిపోతాడు. చాలా భయపడే ధరణి.. కత్తి పట్టి మనుషుల్ని చంపే స్థాయికి వెళ్లిపోతాడు? ధరణి ఎందుకలా మారాల్సి వచ్చింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మీరు ‘దసరా’ని థియేటర్లలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
నాని వన్ మ్యాన్ షో
కీర్తి సురేష్ నటన
మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
యాక్షన్ సీన్స్ తక్కువగా ఉండటం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నటీనటులు: ఈ సినిమాలో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని తన మాస్ లుక్కుతో అందర్నీ ఆకట్టుకున్నాడు అలాగే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ కూడా చూపించడం జరిగింది. నానికి తోడుగా కీర్తి సురేష్ సినిమాలో బాగా నచ్చేస్తుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ దానికి మించి నటన ఈ సినిమాలో చూస్తాము. నాని అలాగే కీర్తి సురేష్ కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంటుంది ప్రేక్షకుణ్ణి.
దీక్షిత్ శెట్టి, సూరి రోల్ కి ఎంత కావాలో అంత ఫెర్ఫెక్ట్ గా జీవించేశాడు. మిగిలిన వారిలో చిన నంబి క్యారెక్టర్ చేసిన మలయాళ నటుడు సైన్ టామ్ చాకో గురించి చెప్పుకోవాలి.సాయి కుమార్, సముద్రఖని తదితరులు మంచి సపోర్ట్ అందించి తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు.
తీర్పు: నాని దసరా మూవీ మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి సినిమాపై భారీ గాని అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. ఆ తర్వాత విడుదలైన ఫస్ట్ లుక్ అలాగే టీజరు సినిమాపై మరింత అంచనాలు పెంచే విధంగా చేశాయి. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్ తో ముందుకు వచ్చిన నాని ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ చూపించారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసుకున్న స్టోరీ కొత్త ఎం కాదు కాకపోతే చూపించిన విధానం కొత్తగా ఉండేటప్పటికీ సినిమా ప్రేక్షకులకి బాగా ఆకట్టుకుంది. ఒక భయపడే వ్యక్తి చివరికి కత్తి పట్టి మనుషుల్ని చంపటం అనే స్టోరీ తో ముందుకు వచ్చిన దర్శకుడు యాక్షన్ సన్నివేశాలను మరింత మెరుగ్గా రాసుకున్నట్టయితే బాగుండేది.
దసరా మూవీలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్రిస్టుతో సినిమా స్టోరీ మొదలవుతుంది. మొదటి భాగం మొత్తం నాని అలాగే కీర్తి సురేష్ మధ్య జరిగే లవ్ స్టోరీ అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించవు. స్టోరీ దగ్గర నుంచి హీరోహీరోయిన్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు.
సెకండాఫ్ కి వచ్చేసరికి అటు ఎమోషన్ తో పాటు యాక్షన్ ని నమ్ముకున్నారు. ధరణి పాత్రలో అసలు సిసలైన మాస్ ని ఒక్కో సీన్ తో ఎలివేట్ చేస్తూ వెళ్లారు.దసరా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటివరకు ధరణి ఎప్పుడు ఫైట్ చేస్తాడా అని ఆడియెన్స్ ఒకటే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలైతే మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మొత్తం మీద దసరా సినిమా యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే కథనంలో కొన్నిచోట్ల ఆసక్తి పెంచే అంశాలు ఆశించిన స్థాయిలో కుదరలేదు. ఓవరాల్ గా ఈ సినిమా నాని ఫ్యాన్స్ తో ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తోంది.