Nani’s Dasara Teaser: నాని చాలా రోజుల తర్వాత మాస్ గెటప్ లో కనిపించబోతున్న సినిమా దసరా. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 30న దసరా టీజర్ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మేకర్స్ జాతీయ స్థాయి ప్రమోషన్‌లను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
Nani’s Dasara Teaser: నాని దసరా మూవీ పలు భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ దసరా టీజర్ ని విడుదల చేయడం కోసం అని తమిళ వెర్షన్‌ని ధనుష్ లాంచ్ చేయనుండగా, రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, షాహిద్ కపూర్ వరుసగా కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో టీజర్‌ను విడుదల చేయనున్నారు.
నాని కెరియర్ లోనే దసరా హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించగా అలాగే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన దసరా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.