‘వెల్డన్’ అల్లు అర్జున్ అంటూ డేవిడ్ వార్నర్ పోస్ట్.. !

0
356
David Warner Reaction On Allu Arjun Buttabomma Song Record

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో ఎంత డి బ్లాక్ బస్టర్ గా అందరికీ తెలిసిందే. సినిమానే కాదు ఇందులోని పాటలు కూడా అంతే విజయం సాధించాయి. సామజవర గమన బుట్ట బొమ్మ రాములో రాముల పాటలు ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టించాయి. దీంతో ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులకు బ్రేకులు పడటం లేదు. సినిమా విడుదలై 11 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ అరుదైన ఫీట్ సాధించడంతో స్టార్ క్రికెటర్

అన్నిటికంటే పెద్ద సెన్సేషన్ ఏంటంటే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అల వైకుంఠ పురములోని అన్ని పాటలకు టిక్ టాక్ లు చిందులేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా స్పందించి డేవిడ్ వార్నర్ కి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ‘బుట్టబొమ్మ’ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తూ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే 450 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి పరుగులు పెడుతోంది బుట్టబొమ్మ.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్డన్ అని స్టేటస్ పెట్టారు. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతూ వార్నర్‌కి కృతజ్ఞతలు చెబుతున్నారు. నేటికీ ‘అల.. వైకుంఠపురములో’ ఆల్బమ్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమాకు ఇంకా మరెన్నో రికార్డ్స్ బాకీ ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే డేవిడ్ వార్నర్ కామెంట్ పై అల్లుఅర్జున్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here