”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ పోస్టర్

0
459
dear-megha-first-look-poster-released
dear-megha-first-look-poster-released

ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ”డియర్ మేఘ” సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి. ”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ ను ఈ రోజు గురువారం, ఫిబ్రవరి 4 తేదీన ఉదయం 9.01 నిమిషాలకు హీరో రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తన సోషల్ మీడియా లో ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ”డియర్ మేఘ” చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలియజేశారు.

 

 

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. సినిమాలో మేఘా ఆకాష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు, కథను నడిపే డ్రైవింగ్ ఫోర్స్ గా ఆమె ఫర్మార్మెన్స్ ఉంటుందని అనుకోవచ్చు. ఆమె కన్నీటికి కారణం ఎవరు, ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది “డియర్ మేఘ” సినిమాలో తెలియనుంది.

 

 

ఇప్పుడు “డియర్ మేఘ” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి లు అందిస్తున్నారు.