Decade on, Allu Arjun's fans make Aarya 2 trend on Twitter
Decade on, Allu Arjun's fans make Aarya 2 trend on Twitter

ఆర్య-2.. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య తర్వాత వచ్చిన సినిమా..! ఎంతో టిపికల్ స్టోరీ లైన్.. అద్భుతమైన పాటలు.. స్టైలిష్ స్టార్ సూపర్ డాన్స్.. కడుపుబ్బా నవ్వించే కామెడీ.. ఈ సినిమా వచ్చి అప్పుడే దశాబ్దం అయిపోయిందంటే నమ్మలేరేమో..! హా అవునండి ఈ సినిమా 2009, నవంబర్ 27న విడుదలైంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా తన అభిమానులతో పంచుకున్నారు. ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత గుండె.. ఎందుకో అని మీ అభిమానాన్ని ప్రేమని చూస్తే అనిపిస్తూ ఉంటుందని ఆర్య-2 సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ఆర్య-2 జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు అల్లు అర్జున్. ముఖ్యంగా సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ కీలక పాత్రలు చేసిన నవదీప్, కాజల్ అగర్వాల్, శ్రద్దా దాస్ లకు కూడా థాంక్స్ చెప్పాడు. ఇక ఈ సినిమా దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడుతూ ఆర్య, ఆర్య-2 సినిమాల విషయంలో ‘సుక్కు’ కు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదని అన్నాడు అల్లు అర్జున్. ఐ లవ్ యు.. నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్ యు నా ప్రాణం పోయినా అంటూ సుకుమార్ కు ధన్య వాదాలు చెప్పాడు బన్నీ.

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమా అతి త్వరలో రాబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆలు అర్జున్ ‘అల వైకుంఠపురం లో’ సినిమా వర్క్ మొత్తం పూర్తవగానే.. ఈ సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొననున్నాడు.

సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. టబు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో సందడి చేయనున్నారు. జులాయి, సన్నాఫ్ సత్య మూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమన్ అందించిన పాటలు హిట్ అవ్వగా.. టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.