షారుఖ్-అక్షయ్.. ఇప్పుడు సహాయానికి ముందు కొచ్చిన బాలీవుడ్ క్యూట్ కపుల్..!

deepika padukone and ranbir kapoor donate to PM relief fund

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కష్టాల్లో ఉన్న వాళ్ళను సహాయం చేయాలని అనుకుంటున్న వాళ్ళు ‘పీఎం కేర్స్ ఫండ్’ కు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు భారీ ఎత్తున విరాళాలు అందిస్తూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ లవబుల్ కపుల్స్ దీపిక పదుకోన్- రణవీర్ సింగ్ జంట కూడా చేరింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు తమ వంతు సాయం చేస్తున్నట్టు దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ జంట సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. తాము ఎంత ఇస్తున్నామో చెప్పలేదు కానీ ‘పీఎం కేర్స్ ఫండ్’ విరాళాన్ని ఇస్తున్నామని అన్నారు.

‘ఇలాంటి సమయంలో ప్రతి చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు మా వంతు సాయం చేస్తామని మాట చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనమంతా ఐకమత్యంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం. జైహింద్’ అని దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ లు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు.

మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్‌ ఫండ్‌కు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలెబ్రిటీలలో ఇప్పటి వరకూ అంత మొత్తంలో విరాళాన్ని ఇచ్చిన హీరో ఆయన మాత్రమే..! పలువురు స్టార్ హీరోలు కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటించారు.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పలు సహాయక కార్యక్రమాలు చేయనున్నారు. ముంబాయ, కోల్‌కతా, దిల్లీ నగరాలలోని పేద ప్రజలను నిత్యావసరాలు అందించడానికి ఆయన సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. షారుఖ్ ఐపీఎల్ జట్టైన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పీఎం సహాయనిధికి విరాళం అందించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రెడ్ చిల్లీస్ తరుపున విరాళం ప్రకటించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, మీర్ ఫౌండేషన్ తరుపున పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో వైద్య సిబ్బందికి 50 వేల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్‌ను అందివ్వనున్నట్టు ప్రకటించారు.