యాసిడ్ దాడి.. ప్రేమించలేదో.. యాసిడ్ పోస్తా..! ఇలాంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ యాసిడ్ బాధితురాలి జీవితంలో చోటుచేసుకునే ఘటనలు.. ఆమె చేసే పోరాటాన్ని చూపించే సినిమాలు చాలా తక్కువ. అలాంటి క్యారెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ చేయడానికి ముందుకు వచ్చింది. పద్మావత్ సినిమా తర్వాత దీపిక నటించిన సినిమా ‘చపాక్’.. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో దీపిక యాసిడ్ దాడి బాధితురాలిలా నటించింది.
దీపిక ఈ సినిమాలో ‘లక్ష్మి అగర్వాల్’ అనే యాసిడ్ బాధితురాలి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ లో మాలతీ(యాసిడ్ బాధితురాలి క్యారెక్టర్) జీవితంలో చోటుచేసుకున్న ఘటనలు చూపించారు. యాసిడ్ దాడి తర్వాత కూడా మాలతీ తనను తాను ప్రేమించడం మొదలు పెడుతుంది. యాసిడ్ అటాక్స్ భారత్ లో జరగకుండా ఆమె చేసే పోరాటం. కనీసం యాసిడ్ కూడా దొరకకుండా చేయాలన్నది ఆమె పోరాడింది. అంతేకాకుండా అమోల్(విక్రాంత్ మాసీ) మాలతీ పోరాటంలో చేసిన సహాయం.. వారి మధ్య చిగురించిన ప్రేమ మొత్తాన్నీ ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాకు మేఘన గుల్జార్ దర్శకత్వం వహించారు. లక్ష్మి అగర్వాల్ క్యారెక్టర్ కోసం ప్రొస్థెటిక్ మేకప్ వేసుకుంది. దాదాపు 42 రోజులు ఆమె ఈ మేకప్ వేసుకున్నారు.
లక్ష్మి అగర్వాల్ 2005 లో యాసిడ్ దాడికి గురయింది. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. 32 సంవత్సరాల వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేయడం.. ఆ తర్వాత ఆమె చేసిన పోరాటం మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. భారత్ లో యాసిడ్ అమ్మకాల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావడానికి కారణం లక్ష్మి అగర్వాల్. ఇంత గొప్ప వ్యక్తికి సంబంధించిన లైఫ్ జర్నీని జనవరి 10, 2020న విడుదల చేయనున్నారు.