Deepika Padukones name in bollywood drug chats ncb to summon to heroine

Deepika Padukone Drug Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుశాంత్ ఆత్మహత్యలో డ్రగ్స్ కోణంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలడంతో వారిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..

డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా బాలీవుడ్ స్టార్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయాను ఎన్సీబీ అధికారులు విచారించిన సమయంలో…ఆమె పలువురు స్టార్ల పేర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వాట్సాప్ చాట్‌లో బాలీవుడ్ నటి దిపికా పదుకొనే పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ సహా పలువురికి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

జయ వాట్సాప్ చాట్ చేసిన దాన్ని బట్టి ఆమె దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురించి చర్చించిటన్టు ఎన్‌సీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఉన్న కోడ్ భాషలో ’D’ అంటే దీపికా అని ’K‘ అంటే కరిష్మా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్‌సీబీ దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మాకు సమన్లు జారీ చేసింది. దీపికాతో పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌. రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేయనున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ మీడియాకు చెప్పారు.