Devara Movie Latest News: ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొరటాల శివ (koratala Siva)దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా దేవర అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాంబినేషన్ క్రేజ్ కారణంగా, RRR వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా కావటంతో, దేవరా చుట్టూ భారీ హైప్ ఉంది. దేవర సినిమా షూటింగ్ కోసం దర్శకుడు కొరటాల శివ ప్లానింగ్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.
Devara Movie Latest News: ఈ రోజుల్లో, ఏదైనా పెద్ద హీరో సినిమా షూట్‌కి చాలా నెలల సమయం పడుతుంది. ఏ పెద్ద సినిమా కూడా షెడ్యూల్‌లు మరియు షూటింగ్‌లను అనుకున్నట్లుగా పూర్తి చెయ్యలేరు అలాగే చాలా పెద్ద ప్రాజెక్ట్‌లు మొదట అనుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు సమయం దానితోపాటు బడ్జెట్ విషయంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి.
అయితే దర్శకుడు కొరటాల శివ (koratala Siva) దేవర కోసం పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీమ్ ప్లాన్‌ల ప్రకారం దేవరాజ్ షూటింగ్ షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని, యాక్షన్ బ్లాక్స్ భారీ స్థాయిలో రూపొందనున్నాయని అంటున్నారు. కొరటాల శివ పర్ఫెక్ట్ అండ్ టెర్రిఫిక్ ప్లానింగ్‌తో దేవరాజ్ షూటింగ్ జరుపుతున్నారంట.

ఎన్టీఆర్ (NTR) కూడా తన తదుపరి సినిమాలు భారీ బడ్జెట్ అలాగే షూటింగ్ సంబంధించిన డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోవడం వల్ల ఈ సినిమా టైం టు టైం కంప్లీట్ చేయాలని కసిగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దేవర శరవేగంగా రూపొందుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్‌లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. దేవర 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.