Devara shooting update, NTR under water fight sequence, Koratala Siva next movie, NTR Devara shooting location, Devara movie latest news
దర్శకుడు కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ కలిసి రెండోసారి చేస్తున్న సినిమా దేవర. దేవర షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో భారీ బడ్జెట్ సెట్స్ లో శరవేగంగా జరుగుతుంది. పూర్తిగా ఆక్షన్ ఎపిసోడ్స్ తో చిత్రీకరణ చేస్తున్న కొరటాల శివ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే లేటెస్ట్ గా ఒక యాక్షన్ ఎపిసోడ్ సీక్రెట్ సంబంధించిన షూటింగు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది.
భారీ యాక్షన్ చిత్రం దేవరాలో (Devara) బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సైఫ్ అలీ ఖాన్ పవర్‍ఫుల్ విలన్ రోల్ చేయనున్నాడు. వీళ్ళతో పాటు శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీ రోల్ లో నటిస్తున్నారు.. కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ (NTR) ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క సీన్ ని (Action Scenes) చాలా జాగ్రత్తగా తీయడం జరుగుతుందంట. ఇక వివరాలు లోకి వెళ్తే , ఇప్పటికే పలు యాక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసిన కొరటాల శివ రీసెంట్ గా మరో యాక్షన్ సీక్వెన్స్ సంబంధించిన షూట్ పూర్తి చేయడం జరిగిందంట.
ఇక దీనికి సంబంధించిన వివరాలు లోకి వెళ్తే, 20 అడుగుల లోపల అండర్ వాటర్ ఆక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చేసిన ఫైట్స్ తెరమీద అందరికీ అద్భుతంగా ఉంటుందని.. అలాగే దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్ కూడా విజువల్ వండర్ గా ఉంటాయని మూవీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. యాక్షన్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ తో తెరకెక్కించిన ఈ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ దాదాపు 20 రోజులు జరిగినట్టు అలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఎన్టీఆర్ 10 రోజులు పాటు తీసుకున్నట్టు తెలుస్తుంది.
అలాగే షైన్ టామ్ చాకో చంపే యాక్షన్ సీన్స్ కూడా అండర్ వాటర్ లోనే జరిగినట్టు చెబుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే సినిమా మాత్రం విజువల్ గా అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు సినిమా వర్గాల వారు .
ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న దేవర సినిమాని ఏప్రిల్ 4న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. నవంబర్ చివర్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. కాగా వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని NTR31 సినిమాకు తారక్ రెడీ కానున్నాడు.