Homeసినిమా వార్తలుఎన్టీఆర్ 30 కోసం పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ టైటిల్.. ఫిక్స్ చేస్తారా.?

ఎన్టీఆర్ 30 కోసం పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ టైటిల్.. ఫిక్స్ చేస్తారా.?

Pawan Kalyan powerful title for NTR30, NTR30 title locked, Devara title locked for Jr NTR and Koratala Siva movie, NTR30 shooting update, NTR30 new shooting schedule details

NTR30 Title: జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ హీరోయిన్ చిన్నవి కపూర్ మొదటిసారిగా కలిసిన సినిమా ఎన్టీఆర్ 30. ఈ సినిమా ని కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీయడం జరుగుతుంది ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో కొరటాల శివ ఈ సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగు మొదలుపెట్టడం జరిగిందంట. NTR30 title ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా పీరియాడిక్ జోనర్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమా కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఈ సినిమాపై భారీ గాని అంచనాలు పెట్టుకున్నారు అంతేకాకుండా కొరటాల శివ విడుదల చేసిన ఫ్రీ లుక్ పోస్టర్ కూడా దీనికి కారణం అయ్యింది. NTR30 సినిమా విఎఫ్ఎక్స్ కోసం దర్శకుడు కొరటాల శివ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రంగంలోకి దించడం జరిగింది.

మే 17 నుండి కొత్త షూటింగ్ షెడ్యూలు హైదరాబాదులో వేసిన భారీ సెట్ లో జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్న NTR30 సినిమాకి అన్ని భాషలకి సరిపోయే రీతిలో ఈ మూవీ టైటిల్ (Title) ని పెట్టాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారంట.

అంతేకాకుండా NTR30 సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే మూవీ టీం నుండి అందుకున్న సమాచారం మేరకు పిఆర్ కోసం దేవర అనే టైటిల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పేరు ని ఉపయోగించారు. అంతేకాకుండా సింపుల్గా అందర్నీ ఆకట్టుకునే విధంగా పాపులర్ అయ్యింది.

Devara title for NTR30

కాకపోతే మొదటిగా ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న PKSDT సినిమా టైటిల్ గా ప్రకటించాలని అనుకున్నారు కానీ సినిమా కంటెంట్ క్లాస్ టచ్ తో ఉండటంతో దేవరా టైటిల్ ని పక్కన పెట్టారు.

ఇప్పుడు అదే టైటిల్ ని NTR30 కోసం పరిటాల శివ అలాగే మేకర్స్ ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ మేగ్జిమమ్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్తడే సందర్భంగా విడుదలవుతున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Web Title: Pawan Kalyan powerful title for NTR30, NTR30 title locked, Devara title locked for Jr NTR and Koratala Siva movie, NTR30 shooting update, NTR30 new shooting schedule details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY