Devi Sri Prasad New Trend Music for Mahesh babu Sarileru Neekevvaru Movie
Devi Sri Prasad New Trend Music for Mahesh babu Sarileru Neekevvaru Movie

మహేష్ బాబు మొదటిసారి కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు మాత్రం అంతకు మించి ట్యూన్స్ కడుతున్నాడట. మొత్తానికి ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని సంగీతం అదరగొట్టేశాడని, పూర్తి సంతృప్తిగా ఉండనుందని ఇండస్ట్రీలో ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే సినిమా మొదలయ్యేటప్పుడే మంచి సంగీతం ఇస్తానని దేవి శ్రీ సభా ముఖంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. జనవరి 12న విడుదలకానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.