దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ కలయిక లో త్రిభాషా చిత్రం

Dhanush – Sekhar Kammula: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తమ అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల తన తాజా ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు తమిళం హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు… శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో రీసెంట్ గా ఈ నిర్మాతలు లవ్ స్టోరి సినిమాను నిర్మించారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles