Homeసినిమా వార్తలుIlayaraja biopic: ధనుష్ ప్రధాన పాత్రలో మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్.

Ilayaraja biopic: ధనుష్ ప్రధాన పాత్రలో మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్.

Dhanush lead role in Ilayaraja biopic, Music director Ilayaraja biopic movie details, Dhanush next movie details, Dhanush's Isaigniani Ilayaraja biopic project 

Dhanush lead role in Ilayaraja biopic, Music director Ilayaraja biopic movie details, Dhanush next movie details, Dhanush’s Isaigniani Ilayaraja biopic project 

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఇటు దక్షిణాది ప్రేక్షకులనే కాదు, ఉత్తరాది ప్రేక్షకులకు సైతం సుపరిచితులయ్యారు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్. ఈ వెర్సటైల్ స్టార్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఆ మూవీ ఏదో కాదు.. మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది.

ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది.

రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సౌత్ సినీ ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకుని కనెక్ట్ మీడియా సహకారంతో మెర్క్యురీ మూవీస్ అనే ప్రత్యేక యూనిట్‌ను మెర్క్యురీ గ్రూప్ ఇండియా ఆవిష్కరించింది. ఇకపై సరికొత్త సినిమాలను, కంటెంట్‌ను అందించేందుకు సిద్దమైంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY