Homeట్రెండింగ్నేనే వస్తున్నా మూవీ రివ్యూ: థ్రిల్ లేని సైకో థ్రిల్లర్

నేనే వస్తున్నా మూవీ రివ్యూ: థ్రిల్ లేని సైకో థ్రిల్లర్

Dhanush Nene Vasthunna Movie Review
రేటింగ్ : 2.5/5
నటీనటులు: ధనుష్, ఎలి అవ్రమ్, ఇంధుజ, యోగి బాబు తదితరులు
దర్శకత్వం : సెల్వ రాఘవన్
నిర్మాత: కలైపులి ఎస్ థాను
సంగీతం: యువన్ శంకర్ రాజా

హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు హీరో ధనుష్. ఇప్పుడు ధనుష్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘నేనే వస్తున్నా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి..

Nene Vasthunna Telugu Movie Review:  కథ: నేనే వస్తున్నా సినిమాలో ధనుష్ డబల్ రోల్ చేయడం జరిగింది. సైకో థ్రిల్లర్ జానర్ తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ ప్రభు, కదిర్ అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ చుట్టూ తిరుగుతుంది. ప్రభు వచ్చేటప్పటికీ తన భార్యాబిడ్డలతో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అనుకోని కారణాలవల్ల ధనుష్ కూతురికి సోను అనే దెయ్యం పడుతుంది. అసలు ఆ సోనూ ఎవరు?, ఎందుకు ధనుష్ కూతుర్నే టార్గెట్ చేసింది?, ఖదీర్ ను చంపాలని ఆ సోనూ ఎందుకు కోరుకుంటాడు? అసలు కదిర్ సైకోలా ఎందుకు మారాడు? చివరికి ఏమైంది.. అనేది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ధనుష్ పెర్ఫార్మెన్స్
విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్:

- Advertisement -

కథనం
సెకండాఫ్
లాజిక్స్ మిస్సింగ్

Dhanush Nene Vasthunna Telugu Movie Review
Dhanush Nene Vasthunna Telugu Movie Review

Nene Vasthunna Review In Telugu:  సాంకేతిక విభాగం : ఈ సినిమాకు హీరో ధనుష్ కథ అందించాడు. కథలోనే పెద్ద క్లారిటీ లేదు. ఆత్మలు అనే పాయింట్ మీద వెళ్లినా కథ కథనాలు ఒళ్లు గగుర్లు పోడిచే సన్నివేశాలతో సగటు ప్రేక్షకుడిని భయపెట్టి కుర్చీకి అతుక్కుపోయేలా చేసేవేమో… కానీ అలా జరగలేదు. అయితే ధనుష్ పెర్ఫార్మెన్స్కు మాత్రం వంద మార్కులు వేయొచ్చు..

కథలో దమ్ము లేకపోవడంతో సెల్వరాఘవన్ తన మ్యాజిక్ ని చేయలేకపోయాడు. తనదైన టేకింగ్ తో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా సరైన కథ ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. యువన్ శంకర్ రాజా తనదైన బీజీఎమ్స్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు.

కానీ సినిమాల్లో సరైన సన్నివేశాలు లేక అతని ప్రయత్నం కూడా వృధానే అయింది. టేకింగ్ మేకింగ్ పరంగా పరవాలేదు. దర్శకుడు సెల్వ రాఘవన్ మంచి కథను తీసుకున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్లే ను రాసుకుని, సినిమాని తీసి ఉంటే ఈ సినిమా కమర్షియల్ గా కూడా మరో స్థాయిలో ఉండేది.

Dhanush Nene Vasthunna Movie Review in telugu
Dhanush Nene Vasthunna Movie Review in telugu

విశ్లేషణ: డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇక గణేష్ పర్ఫామెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏ సినిమా చేసినా ఆ క్యారెక్టర్ లో తనదైన ముద్ర ఉన్న వేసుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ధనుష్ – కూతురికి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఎలివెట్ అయ్యాయి. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ఎలి అవ్రమ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

యోగి బాబు పంచ్ లు పర్వాలేదు. ప్రభుతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. సెకెండ్ హాఫ్ లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడంతో పాటు ఖదీర్ ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు బాగాలేదు. దీనికితోడు సెకెండ్ హాఫ్ లో చాలా సీన్స్ మరీ సినిమాటిక్ గా సాగుతాయి. సెకండాఫ్ ని కూడా డైరెక్టరు మరికొంత బాగా రాసుకున్నట్టు అయితే సినిమా ఒకరకంగా ప్రేక్షకులకు నచ్చేది. డార్క్ థ్రిల్లర్, సైకో జానర్ మూవీస్ లో ఎప్పుడైనా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఈ విషయంలో డైరెక్టర్ సెల్వరాఘవన్ తడబడ్డాడు.

తీర్పు: ధనుష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ బాగా స్లోగా బోర్ గా సాగడం.. లాజిక్ లక అందకుండా సాగిన సీక్వెన్సెస్ వంటి అంశాలు ఈ సినిమా అక్కడక్కడ మెప్పించినా ఓవరాల్ గా మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ ని కలిగించలేక ఊసూరుమనిపించింది. ఓవరాల్ గా ఈ ‘నేనే వస్తున్నా’ థిల్లర్ థ్రిల్ చేయలేక పోయింది.

 

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY

Dhanush Nene Vasthunna Movie Review రేటింగ్ : 2.5/5 నటీనటులు: ధనుష్, ఎలి అవ్రమ్, ఇంధుజ, యోగి బాబు తదితరులు దర్శకత్వం : సెల్వ రాఘవన్ నిర్మాత: కలైపులి ఎస్ థాను సంగీతం: యువన్ శంకర్ రాజా హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు హీరో ధనుష్. ఇప్పుడు ధనుష్...నేనే వస్తున్నా మూవీ రివ్యూ: థ్రిల్ లేని సైకో థ్రిల్లర్