Dhanush next Sir Release Date: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ సార్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తమిళంలో వాతి (Vaathi) అని అలాగే తెలుగులో సార్ అని టైటిల్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 2 విడుదల అని ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు సార్ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది.
Dhanush next Sir Release Date: రెండు నెలల క్రితం ధనుష్ సినిమా సార్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 2న విడుదల అవుతుందని సంతోషం లో ఉన్న ధనుష్ ఫాన్స్ కి మళ్లీ ఈ రోజు సార్ విడుదల తేదీ మార్చినట్టు ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు మరియు తమిళంలో విడుదల చేస్తున్నారు.
వాస్తవానికి సార్ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల ధనుష్ రాబోయే సినిమా సార్ ని ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సార్ సినిమా షూటింగు ఇంకా కంప్లీట్ కాలేదు అని అలాగే కథలో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
సార్ సినిమాలో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.