తమిళ్ హీరో ధనుష్ (Dhanush) మా అందరికీ తెలిసిన వాడే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ధనుష్ (Dhanush) కి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ్ సినిమాల్ని ఇక్కడ కూడా డబ్బింగ్ చేసి ఇ రిలీజ్ చేసే వాళ్ళు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ (Dhanush) తో తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’ లో రానా సరసన చేస్తున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకి తెలుగులో ‘సార్’ (SIR), తమిళ్ లో ‘వాతి’ (Vaathi) అనే టైటిల్ పెట్టారు.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరో ధనుష్ (Dhanush), హీరోయిన్ సంయుక్త మీనన్ లపై ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) క్లాప్ ఇచ్చారు.
ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. జనవరి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరగనుందని తెలిపారు.