ధనుష్ ‘కర్ణన్‌’ పోస్టర్

0
325
dhanushs-karnan-to-release-in-on-april-9
dhanushs-karnan-to-release-in-on-april-9

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో  పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్ణన్‌’. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక ఊరినే నిర్మించేశారు.  తాజాగా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు.

 

 

రక్తంతో తడిసిన చేతికి బేడీలు, తలకి గాయంతో రక్త కారుతుండగా, కోపం, ఆవేశం కలగలిపిన లుక్‌లో ధనుష్‌ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా బానిస సంకెళ్లలో మగ్గుతున్న, అణచివేతకు గురవుతున్న ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఏప్రిల్‌ 9న ‘కర్ణన్‌’ సినిమాను విడుదల చేయబోతున్నారు. కాగా, అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కానుంది.