Dhanush SIR Release Date: వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ధనుష్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే భీమ్లా నాయక్ లో నటించిన సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది.
Dhanush’s Vaathi (SIR) Release Date: ‘సార్’ సినిమాకు సంబంధించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నా ‘సార్’ సినిమాని డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ మూవీలో ధనుష్ జూనియర్ లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. ఎడ్యుకేషన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు నిర్మాతలు.
సార్ సినిమా పోస్టర్ ని గమనిస్తే ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు సంభందించిన అంశాలను చూపిస్తూ ఉండటం కనిపించే చిత్రం ఆకట్టుకుంటోంది. ఇంత వరకు ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
సాయి కుమార్ తనికెళ్ల భరణి నర్రా శ్రీనివాస్ వంటి నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇదే రిలీజ్ డేట్ కి బాలయ్య NBK107 విడుదల చేద్దామని అనుకున్నారు కానీ నీ సినిమా కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు బాలయ్య టీం వేరే డేట్ ని చూస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.