Dhee Choreographer Chaitanya Suicide video: ఈటీవీలో ఎప్పటినుంచో ప్రసారం అవుతున్న పాపులర్ డాన్స్ షో ‘ఢీ’. ఎందరో డాన్సర్స్ కి జీవితాన్నిచ్చిన ఈ షో కు సంబంధించిన కొరియోగ్రాఫర్ వత్తికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఢీ’ డాన్స్ షో (Dhee Show) తో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్య మాస్టర్ (Chaitanya Master). అయితే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకి వచ్చిన చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక వత్రికి గురి అవుతున్న అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో (Video) రికార్డు చేసి ఉరి వేసుకున్నారు.
Dhee Choreographer Chaitanya Suicide video: వివరాల్లోకి వెళ్తే శనివారం వరల్డ్ డాన్స్ డే సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి చైతన్య నెల్లూరుకి వచ్చారు. ఆ తర్వాత ఆదివారం రోజు నెల్లూరులోని క్లబ్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఘటనకు ముందు తన మనోవ్యాధనం ఓ సెల్ఫీ వీడియో రూపంలో రికార్డు చేసి తన సూసైడ్ వెనుక కారణాలను వివరించారు.
సెల్ఫీ వీడియోలో (Video) తన ఆత్మహత్యకు కేవలం అప్పుల బాధలే కారణమని చైతన్య(Chaitanya Master) పేర్కొన్నారు. ఆదివారం చైతన్య ఆత్మహత్యతో ఈటీవీ నటీనటీలలో మరియు ‘ఢీ’ కుటుంబ సభ్యుల లో విషాద ఛాయలు నెలకొన్నాయి. తాను రికార్డ్ చేసిన వీడియోలో చైతన్య మాస్టర్ (Chaitanya Master) మమ్మీ ,డాడీ ,చెల్లి తనని ఎంతో బాగా చూసుకున్నారని…తనకి ఎప్పుడు ఎటువంటి కష్టం రానివ్వలేదని తెలిపారు. కేవలం తనకున్న ఫైనాన్షియల్ కష్టాల వల్లే ఈ రేషన్ తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
తాను ఇలా చేస్తున్నందుకు ఫీల్ కావద్దని చెల్లికి తెలియపరచడంతో పాటు జీవితంలో ఎన్నో చేద్దామనుకున్నాను కానీ కుదరట్లేదని బాధపడ్డారు. తాను పనిచేస్తున్న ఢీ షోలో క్లోజ్ గా ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు మిగిలిన మాస్టర్స్ అందరినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నందుకు అందరికీ క్షమాపణలు తెలిపారు.
తీర్చే సత్తా ఉంటేనే అప్పులు తీసుకోవాలని లేకపోతే అది భారం అవుతాయని.. తాను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ తీర్చలేక పోతున్నాను అన్న మనోవేదతోనే ఇలా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చివరిగా ‘ఢీ’ షో సేమ్ ఇస్తుంది తప్ప సంపాదన ఎక్కువగా ఉండదని…ఇదే జబర్దస్త్ షో అయితే ఎక్కువ సంపాదించి ఉండే వాడిని చైతన్య మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. కారణం ఏదైనా కొన్ని జీవితం బలవడంపై బుల్లితెర బాధపడుతుంది….
RIP #Chaitanya Master 🥺💔😭 pic.twitter.com/oOYvCwv3AW
— Allu Prashanth 🪓 (@Alluprashanth9) April 30, 2023