SPY and Devil story: సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని ఫిలిమ్ ఇండస్ట్రీ కి సంబంధించిన మూవీ లవర్స్ ఇష్టపడుతూ ఉంటారు.. ఇప్పుడు అదే నేపథ్యంతో మన ముందుకు రెండు సినిమాలు రాబోతున్నాయి.. నిఖిల్ (Nikhil) సిద్ధార్థ కార్తికేయ2 తరవాత స్పై (SPY) అనే మూవీ తో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.. దీంతోపాటు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) డెవిల్ (Devil) అనే సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ రెండు సినిమాలు స్టోరీ ఒకటే అంటూ ప్రచారంలో ఉంది. దీనిపై నిఖిల్ సిద్ధార్థ క్లారిటీ ఇవ్వటం జరిగింది..
SPY and Devil story: ఇక విషయాల్లో కి వెళ్తే, రీసెంట్ గా నిఖిల్ చేసిన స్పై (SPY Movie) మూవీ టీజర్ ని విడుదల చేయడం జరిగింది.. టీజర్ విడుదల చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు మరియు దాని చుట్టూ ఉన్న కుట్రలను గూఢచారి ఎలా ఛేదించాడు. అనే కథతో వస్తున్నట్టు అర్థమైంది.. అలాగే కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా ఇదే కదా అంశంతో డెవిల్ (Devil) సినిమా ని తెరకెక్కిస్తున్నారు.. డెవిల్ కథ (Devil Story) కూడా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ చుట్టూ తిరుగుతుందని వినికిడి మరియు కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తాడు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఒకే కథ సారాంశం తో రెండు సినిమాలు రావటం అనేది సర్వసాధారణం. అయితే ఇదే విషయాన్ని పై టీజర్ విడుదల సందర్భంగా నిఖిల్ ని ప్రశ్నించగా.. నిఖిల్ (Nikhil) దీనికి సమాధానం ఇస్తూ.. డెవిల్ మరియు స్పై కథలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, ఆయా దర్శకులు ఇప్పటికే దాని గురించి చర్చించుకున్నారని చెప్పాడు. రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నిఖిల్ హామీ ఇచ్చాడు.

డెవిల్ 1920లలో ఎక్కడో సెట్ చేయబడిందని, అయితే స్పై ప్రస్తుత మోడ్రన్ థ్రిల్లర్ నుండి వచ్చినదని అతను వెల్లడించాడు. కాబట్టి, డెవిల్ మరియు గూఢచారి కథలు ఒకదానికొకటి వంద సంవత్సరాల తేడా ఉంటుందని నిఖిల్ కామెంట్ (Nikhil Comment) చేయడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. రెండు చిత్రాలలో స్టోరీ అనేది ఒకటే ఉండవచ్చు, ఒకరు దానిని అంచనా వేస్తారు, మరొకరు అది జరిగిందని నిరూపించవచ్చు. అన్నది తెలియాలంటే రెండు సినిమాలూ విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Web Title: different store’s for Devil And Spy Movies Says Nikhil , Nikhil, Kalyan Ram, Spy, Devil, Nikhil comments on Kalyan Ram Devil Story, New Movies, Nikhil Spy Movie Updates, Devil Movie Update, SPY movie story..