100 కోట్లకు కూడా లొంగని దిల్ రాజు..!

0
2773
dil raju taken final decision on pawan kalyan vakeel saab release

Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ ‌సాబ్’ విషయంలో దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారట. ఎంత భారీ ఆఫర్ వచ్చినా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేదే లేదని ఆయన ఫిక్స్ అయ్యారట.

ఏపీలో ఎన్నికలకు కాస్తా సమయం ఉండటంతో ఆయన ఓ నాలుగు సినిమాలకు ఓకే అన్నాడు. అందులో ఒకటి వకీల్ సాబ్. దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వకీల్‌ సాబ్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారట. తన సినిమాకే కాదు థియేటర్లకు కూడా మేలుకలిగేలా డిసీజన్ తీసుకున్నారట దిల్ రాజు.

dil raju taken final decision on pawan kalyan vakeel saab release

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ బంద్ కావడం, థియేటర్స్ మూతపడటం లాంటి కారణాల వల్ల ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు 100 కోట్ల డిజిటల్ ఆఫర్ వచ్చిందట. అయినా కూడా నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టారనే వార్త వినిపిస్తోంది.

థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక జనాన్ని థియేటర్‌కి రప్పించడంలో వకీల్ సాబ్ కీలక పాత్ర పోషించాలని ఫిక్స్ అయిన దిల్ రాజు.. ఈ సినిమాను డైరెక్టుగా థియేటర్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారట. ఇక లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. కాగా తాజాగా ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతులు ఇవ్వడంతో ఈ సెప్టెంబర్ చివరి వారం నుంచి మళ్లి షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించనున్నారని సమాచారం.

dil raju taken final decision on pawan kalyan vakeel saab release

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.